Friday 6 September 2024
అఖ్యాహి మే కో భవానుగ్రరూపో
అఖ్యాహి మే కో భవానుగ్రరూపో
నమోఽస్తుతే దేవవర!ప్రసీద
విజ్ఞాతు మిచ్ఛామి భవంత మాద్యం
న హి ప్రజానామి తవ ప్రవత్తిమ్॥31-11
విశ్వరూప సందర్శన యోగము
అర్జునుడికి దిక్కు తోచడంలేదు.మంటలలోకి దూకే మిడతల దండులా సమస్త రాజవంశం లోని వీరులందరూ విశ్వరూపం యొక్క అనంత ముఖాలలోకి దూసుకు పోతున్నారు.ఆయన యొక్క భీకరమయిన రూపం చూసి జగత్తు అంతా తపించి పోతుంది.సర్వ లోకాలనూ మింగేస్తున్నాడు.అర్జునుడు వేడుకుంటున్నాడు.
ఓ దేవదేవా!నీకు దండ ప్రమాణాలు చేస్తున్నాను.నీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను.ఇంత భయంకర స్వరూపుడవు అయిన నువ్వు ఎవరివి?దయచేసి నువ్వెవరో చెప్పు.నీ వివరాలన్నీ చెప్పు.ఇంత కోపం దేనికి?ఇంతటి ఉగ్రరూపం దాల్చేదానికి కారణాలు ఏంది?ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు?నీ ఈ ప్రవర్తనకు అర్ధం,పరమార్ధం నా బుర్ర గ్రహించలేక పోతున్నది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment