Thursday, 5 September 2024
యథా నదీనాం బహవోఽంబువేగాః
యథా నదీనాం బహవోఽంబువేగాః
సముద్రమేవాభిముఖా ద్రవంతి
తథా తవామీ నరలోక వీరాః
విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి॥28-11
విశ్వరూప సందర్శన యోగము
పిల్ల కాలువలు నదిలో కలుస్తాయి.నదులన్నీ సముద్రం లో ఏకమవుతాయి.ఇది వాటి సహజ గుణం.అలానే మనమందరమూ ఆపరబ్రహ్మ నుండే పుట్టాము.మళ్ళీ ఆ విశ్వేశ్వరుడిలోకే లయమవుతాము.
ఇక్కడ అర్జునుడు చూస్తుంటే,సమస్త రాజలోకమూ ఆ విశ్వకర్మ యొక్క భయంకరమయిన ముఖాగ్ని లోపలికి పొర్లి పోతుంది.దాంట్లో అనేక మంది రాజులు వున్నారు.కౌరవులుఅందరూ వున్నారు.భీష్ముడు,ద్రోణుడు,కర్ణుడు,ఇంకా చాలా మంది యోధులూ వున్నారు.ఆఖరికి పాండవుల పక్షంలోని వీరులుకూడా చాలా మంది కనిపించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment