Wednesday, 4 September 2024
దంష్ట్రా కరాళాని చ తే ముఖాని
దంష్ట్రా కరాళాని చ తే ముఖాని
దృష్ట్వైవ కాలానల సన్నిభాని
దిశో న జానే న లభే చ శర్మ
ప్రసీద దేవేశ జగన్నివాస॥25-11
విశ్వరూప సందర్శన యోగము
మాములుగా చాలా మందికి చీకటి అంటే భయం.
కొన్ని సార్లు నిశబ్దంగా వున్నప్పుడు వంటింట్లో పళ్ళెం చెయ్యి జారి కింద పడినా గుండె ఝల్లు మంటుంది మనకు.ఇలా చాలా మందికి చాలా రకాల భయాలు వుంటాయి.కొన్ని సార్లు ఎదుటి వాళ్ళ భయాలు చాలా చిన్నవిగా కనిపిస్తుంటాయి.ఇక్కడ అర్జునుడు విశ్వరూపం చూసి భయపడకుండా వుంటాడా,ఎంత వీరుడు,శూరుడు,విక్రమార్కుడైనా!!
ఆ విశ్వరూపానికి భయంకరమైన కోరలు,దంతాలు వున్నాయి.ఆ ముఖాలు అన్నీ కాలాగ్నిలా,అగ్ని గోళాలు లాగా వెలిగి పోతున్నాయి.అన్నేసి వున్న ఆ ముఖాలు,కాళ్ళు,చేతులు,ఉదరాలు,ఆయుధాలు,భగ భగ మండే నేత్రాలు..... వీటన్నిటినీ ఒక్కసారిగా చూసేటప్పటికి అర్జునుడు ఖంగు తిన్నాడు,భయపడి పోయాడు.
భగవంతుడా,విశ్వేశ్వరా! నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది.నన్ను కాపాడు స్వామీ!నన్ను కరుణించు జగత్ రక్షకా!అని వేడుకుంటున్నాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment