Saturday, 12 October 2024
సుదుర్దర్శమిదం రూపం
శ్రీ భగవానువాచ...
సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ।
దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః॥52॥
శ్రీమద్భగవద్గీత...ఏకాదశాధ్యాయము
విశ్వరూప సందర్శన యోగము
శ్రీ కృష్ణుడు అర్జునుడుతో అతను ఎంత అదృష్టవంతుడో చెబుతున్నాడు.అర్జునా!నీకు ఇప్పుడు నా విశ్వరూపం చూపించాను కదా!అది చూడగలగటం అంత ఆషామాషీ వ్యవహారం కాదు.అది అంత తేలికగా,సులభంగా అందరికీ దక్కదు.నా ఈ విశ్వరూపాన్ని చూసి తరించాలని దేవతలు,మునులు జన్మ అంతా పరితపిస్తుంటారు.కానీ నేను నీకు ఆ సౌలభ్యం కల్పించాను.
Subscribe to:
Post Comments (Atom)
అయితే మనం చూడ్డానికి సాధన ఏం చేయాలి
ReplyDeleteసాధన క్రమంగా ఒక కోర్స్ చేస్తే బాగుంటుంది
ReplyDelete