Sunday, 6 October 2024

అదృష్టపూర్వం హృషితోఽస్మి దృష్ట్వా

అదృష్టపూర్వం హృషితోఽస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే త దేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస॥45॥ శ్రీ మద్భగవద్గీత...ఏకాదశాధ్యాయము.. విశ్వరూప సందర్శన యోగము మనము మాములుగా గుడికి పోతే ఏమి చేస్తాము?ఒక్కసారి దేవుడిని చూస్తాము.తరువాత మనకు తెలియకుండానే కళ్ళు మూసుకుని,మన కోర్కెలు కోరుకుంటాము.ఎక్కువ మంది వుండి,గర్భగుడిలో ఎక్కువ సేపు వుండలేక పోతే దిగులు పడతాము.కానీ ఖాళీగా వున్నా ఎక్కువ సేపు చూస్తూ వుండలేము. ఇక్కడ అర్జునుడి పరిస్థితి కూడా అదే.అందుకే కృష్ణుడితో ఇలా విన్నవించుకుంటున్నాడు.స్వామీ!ఇంతకు ముందెప్పుడూ నీ ఈ రూపం చూడలేదు.ఇంత అద్భుతమైన రూపాన్ని ఎక్కడా ఎప్పుడూ కనీ,విని ఎరుగ లేదు.ఇదంతా చూసి నా మనసు ఆవేశంతో కలవరపడుతుంది.ఓదేవాది దేవా!నా మీద దయ వుంచు.నువ్వు నీ పూర్వరూపాన్ని సంతరించుకో.నా ఈవిన్నపం మన్నించు.నీ పూర్వరూపాన్ని పొంది నన్ను అనుగ్రహించు.

1 comment:

  1. దేవకి దేవకి కి ఇట్లాంటి రూపంతోనే కనబడతాడు. ఆమె తట్టుకోలేక రూపాన్ని తగ్గించు అంటుంది అప్పుడు నాలుగు చేతులు శంకచక్ర గదా హస్తాలతో పుడతాడు. కానీ ఆమె ఇంకా నీ రూపాన్ని తగ్గించు అని అంటుంది అప్పుడు అతను ఇంకా తగ్గి రెండు చేతులతో నల్లగా రూపాన్ని సంతరించుకుంటాడు.

    ReplyDelete