Saturday, 3 January 2026
అధర్మాభి భవాత్ కృష్ణ
అధర్మాభి భవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః।
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః॥41॥1॥
శ్రీమద్భగవద్గీత..।అర్జున విషాద యోగము...
మామూలుగా అన్నీ బాగుంటే మనమూ బాగుంటాము.పరిస్థితులు తారుమారు అయితే మనమూ అతలాకుతలము అవుతాము.అప్పుడు జీవనం ఎలా సాగించాలి?ఎలా బ్రతకాలి అనేదే ముఖ్యం అవుతుంది.అప్పుడే మనలో ఉండే అసలు మనిషి,అసలు వ్యక్తిత్వం బయట పడతాయి.చాలా మందికి కష్టాలూ,కడగళ్ళు అంటే భయం.అందుకనే ఎవరైనా కష్టాలలో ఉంటే వారి దరిదాపుల్లోకి కూడా ఎవరూ పోరు.అది అంటు వ్యాధి కాదు.కానీ అందరూ భయపడతారు.
మన పని కావటం ముఖ్యం అనుకుంటారు.అనుసరించే మార్గం ఏదైనా పరవాలేదు అనుకుంటారు.
అర్జునుడు అదే కృష్ణుడికి చెబుతున్నాడు.
హే కృష్ణా!అధర్మం పెరిగితే ఏమవుతుంది?ఎవరూ మంచి బాటలో నడవాలని అనుకోరు.కులస్త్రీలు దుష్టులుగా పరిణమిస్తారు.వారు సక్రమమయిన మార్గంలో నడవక పోతే ఏమవుతుంది?వర్ణ సంకరమేగా!కులం భ్రష్టు పట్టిపోతుంది.ఆచార వ్యవహారలకు పాతర వేస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment