Tuesday, 10 June 2025
దాతవ్యమితి యద్దానం
దాతవ్యమితి యద్దానం దీయతేఽనుపకారిణే।
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతమ్॥20॥
శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి యజ్ఞము,తపస్సుల గురించి వివరించాడు.ఇప్పుడు దానాలలో రకాల గురించి చెబుతున్నాడు.ఓ అర్జునా!పుణ్యస్థలాలలో దానం చేయటము అనే ప్రక్రియ కర్తవ్యము అనుకోవాలి ప్రతి ఒక్కరూ.దానం చేయమన్నారు కదా అని ఏదో ఒకటి ఇచ్చేసి,చేతులు దులిపేసుకో కూడదు.మనము చేసే దానము దేశకాల పాత్రలకు అనుగుణంగా,అనుసరించి ఉండాలి.అంటే వివరంగా చెబుతాను విను.ఆ ప్రాంతంలో వారికి ఏది అవసరమో కనుక్కొని ఇవ్వగలగాలి.అంటే మనము చేసేది వారికి ఉపయోగ పడాలి.అలాగే కాలానికి సరిపోయేటట్లుగా.అంటే చలికాలంలో దుప్పటి ఇస్తే పనికి వస్తుంది.ఎండా కాలంలో నీరు,నీడ,గాలి అవసరము.కాబట్టి చలివేంద్రాలు,ఎండ నుంచి కాపాడుకునేదానికి,ఉక్క నుంచి ఉపశమనానికి ఉపకరణాలు సమకూర్చడం లాంటివి.అలానే అవసరంచూసి,అవసరము అయినవారికి చేయాలి.అపాత్ర దానం చేయకూడదు.అలా సహాయ సహకారాలు అందిచడంలో మనము ఎలాంటి ప్రతిఫలం ఆశించకూడదు.మనకు ఉపయోగము పొందేవారి నుంచి ఎలాంటి ఉపయోగము,లాభము ఉండకూడదు.ఇలా చేసే దానాలను సాత్త్వికమయిన దానం అంటారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment