Monday, 23 June 2025
ఏతాన్యపి తు కర్మాణి
ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ।
కర్తవ్యా నీతి మే పార్థ నిశ్చితం మత ముత్తమమ్॥6॥
శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
భగవంతుడు అయిన శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!మానవుడు యజ్ఞము,దానము,తపము విడవకుండా చెయ్యాలని చెప్పాను కదా!అవి కూడా ఎలా చెయ్యాలో చెబుతాను విను.మనము చేసే ఏ కర్మలలోనూ ప్రతిఫలము ఆశించకూడదు.ఆశ,బంథము,మమకారము,లోభము,లాలస లేకుండా చేయగలగాలి.అంటే ఆ యజ్ఞాది కర్మలు అన్నిటినీ కూడా కర్తృత్వమమకారము,ఫలాపేక్షలు విడిచిపెట్టి చెయ్యాలి.అలానే చేయాలనేది నా నిశ్చితమయిన అభిప్రాయము.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment