Friday, 6 June 2025
మనః ప్రసాదస్సౌమ్యత్వం
మనః ప్రసాదస్సౌమ్యత్వం మౌన మాత్మవినిగ్రహః।
భావసంశుద్ధి రిత్యేత త్తపో మానసముచ్యతే॥16॥
శ్రీమద్భగవద్గీత...సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంతకు ముందు శరీరం తో చేసే తపస్సు,మాటలు అదే వాక్కుతో చేసే తపస్సు గురించి చెప్పాడు కదా!ఇప్పుడు మనసుతో చేసే తపస్సు గురించి చెబుతున్నాడు.
అర్జునా!ఇప్పుడు నేను నీకు మనసుతో చేసే తపస్సు గురించి చెబుతాను.శ్రద్ధగా విను.మన మనసు నిశ్చలంగా ఉండాలి.మాటలలో,చేతలలో లాగే భావరూపకంగానూ మృదుత్వం ఉండాలి.మౌనం ముఖ్యంగా ఉండాలి.ఎందుకంటే మౌనంగా ఉన్నప్పుడే మనము మనలని విశ్లేషించుకునే సమయం,సందర్భం దొరుకుతుంది.చెడు ఆలోచనలనుంచి బయటపడాలి.అప్పుడే కదా మన అంతఃకరణ శుద్ధిగా ఉంటుంది.
నిశ్చలమయిన మనస్సు,మృదుత్వం,మౌనము,శుద్ధమయిన అంతఃకరణము కలిగి ఉండటానినే మనసుతో చేసే తపస్సు అంటారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment