Saturday, 28 June 2025
న హి దేహభృతా శక్యం
న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్య శేషతః।
యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీ త్యభిదీయతే॥11॥
శ్రీమద్భగవద్గీత.।।అష్టాదశాధ్యాయము
మోక్షసన్న్యాస యోగము
శ్రీకృష్ణుడు భగవంతుడు.ఆయనకు మానవుల బలాలు,బలహీనతలు అన్నీ క్షుణ్ణంగా చెలుసు.ఆయన అర్జునుడికి ఇలా చెబుతున్నాడు.అర్జునా!దేహధారులకు కర్మలను అన్నిటినీ విడవటం అసాథ్యం.అది కూడని పని అని నాకూ తెలుసు.అందువల్ల నేను ఏమి చెబుతానో విని అర్థం చేసుకో.కర్మలను వదలడం పూర్తిగా మానవమాత్రులకు కుదరదు కాబట్టి,కనీసం కర్మఫలాన్ని వదులుకోగలగాలి.అలా కర్మఫలాన్ని వదలగలిగిన వాడే త్యాగి అని నా భావము.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment