Tuesday, 3 June 2025
దేవ ద్విజ గురు ప్రాజ్ఞ
దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవమ్।
బ్రహ్మ చర్య మహింసా చ శారీరం తప ఉచ్యతే॥14॥
శ్రీమద్భగవద్గీత....సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి తపస్సు ఏ ఏ రకాలుగా ఆచరించ వచ్చో వివరంగా చెబుతున్నాడు.అర్జునా!ఇంత సేపు మనము వివిధ రకాలు అయిన యజ్ఞాల గురించి మాట్లాడు కున్నాము కదా!ఇప్పుడు తపస్సులలో రకాల గురించి నీకు వివరంగా చెబుతాను.మనసు పెట్టి శ్రద్ధగా ఆలకించు.ఇప్పుడు నీకు నేను శరీరంతో చేసే తపము గురించి చెబుతాను.మనము దేవతలను,బ్రాహ్మణులను,గురువులను,పెద్దలను పూజించాలి.శుచి,శుభ్రత పాటించాలి.మన జీవన శైలిలో సరళత్వం గోచరించాలి.విశృంఖలత్వం లేకుండా బ్రహ్మచర్యం పాటించాలి.ఇతర ప్రాణుల పైన హింస విడనాడి అహింసా మార్గంలో పయనించాలి.
ఇక ముఖ్యంగా ఆర్జవము పాటించాలి.అంటే మనసులో కల్మషం లేకుండా ఉండాలి.మనసులో ఒకటి,బయటకు ఇంకొకటిగా ఉండకూడదు.నిజాన్ని నిర్భయంగా,నిస్సందేహంగా చెప్పగలగాలి.రాముడికి లాగా ఒకటే మాట,ఒకటే బాణం లాగా ఉండాలి.ద్వంద్వాతీతంగా ఉండాలి.అంటే అటు ఇటుగా కాకుండా,ఒకటే మంచి దారిలో నడవాలి.
ఇలా ఉండగలగటాన్ని శరీరంతో చేసే తపస్సు అంటారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment