Friday, 27 June 2025
న ద్వేష్ట్య కుశలం కర్మ
న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే।
త్యాగీ సత్త్వ సమావిష్టో మేధావీ ఛిన్న సంశయః॥10॥
శ్రీ మద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము
మోక్ష సన్న్యాస యోగము
శ్రీ కృష్ణుడు అర్జునుడికి సాత్త్విక త్యాగము గురించి విడమరచి చెబుతున్నాడు.ఎందుకంటే మంచి విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్పాలి,అర్థం అయ్యేలా,మనసుకు హత్తుకునేలా చెప్పాలి.మనము కూడా ఆచరిద్దాము అనే తృష్ణ ఎదుటివారిలో కలిగేలా చెప్పాలి.
అర్జునా!సత్త్వ గుణ ప్రధానంగా ప్రతి ఒక్కరూ వర్థమానులు కావాలి.అలా కావాలంటే మొదట ఆసక్తిని,ఫలాన్ని విడిచి కర్మలు చేయటానికి శ్రీకారం చుట్టాలి.ఇలా ప్రతి నిత్యం చేస్తూ,ఆత్మ జ్ఞానం పొందాలి.ఈ యజ్ఞంలో ఎలాంటి అనుమానాలకూ,సందేహాలకూ తావు ఇవ్వకూడదు.అలాంటి సందేహరహితుడు,ఆత్మజ్ఞాని దుఃఖాలను ఇచ్చే కర్మలను ద్వేషించడు.అంతేనా?అలాగే సుఖాలను ఇచ్చే కర్మలనూ ఆమోదించడు,ఇష్టపడడు.నిర్వికారంగా తన ధర్మాన్ని తాను పాటిస్తూ ముందుకు పోతాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment