Friday, 13 December 2024
యదా భూతపృథగ్భావం
యదా భూతపృథగ్భావం ఏకస్థ మనుపశ్యతి।
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా॥31॥
శ్రీమద్భగవద్గీత....త్రయోదశాధ్యాయము
క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము
కృష్ణుడు అర్జునుడితో ఇలా చెబుతున్నాడు.అర్జునా!మొదట మనం అన్ని భూతాలను ఆత్మపరంగా చూడటం నేర్చుకోవాలి.ఈసృష్టిలో వుండే ప్రతి అణువు పరమాత్మ నుండే పుట్టిందని గ్రహించాలి.అంతేకాదు.అవన్నీ కూడా ఆత్మగతమై,సర్వత్రా నిండి వున్నాయని అర్థం చేసుకోవాలి.ఇదంతా జీర్ణించుకున్న మానవుడే బ్రహ్మత్వాన్ని పొందగలడు.ఈ మహనీయమయిన దశ మానవుడికి ఎప్పుడు ప్రాప్తిస్తుందో,ఆ క్షణంలోనే బ్రహ్మలో ఐక్యంకాగలడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment