యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః।
క్షేత్రంక్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత॥34॥
శ్రీమద్భగవద్గీత...త్రయోదశాధ్యాయము
క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము
కృష్ణుడు అర్జునుడికి సులభతరంగా అర్థం కావాలి అని శతవిథాల ప్రయత్నిస్తున్నాడు.హే అర్జునా!హే భరతశ్రేష్టా!సూర్యుడు ఒక్కడే కదా ఉండేది. కానీ ఆయన ఈ జగత్తునంతా ప్రకాశింప చేస్తున్నాడు కదా!అలాగే క్షేత్రజ్ఞుడు అయిన పరమాత్మ క్షేత్రములు అయిన సర్వ దేహాలనూ ప్రకాశింప చేస్తున్నాడు.వాటిని చేతనత్వముతో నింపుతున్నాడు.
No comments:
Post a Comment