Tuesday, 17 December 2024
క్షేత్ర క్షేత్రజ్ఞయో రేవం
క్షేత్ర క్షేత్రజ్ఞయో రేవం అంతరం జ్ఞానచక్షుషా।
భూత ప్రకృతి మోక్షం చ యే విదుర్యాంతి తే పరమ్॥35॥
ఇతి శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశాధ్యాయః
శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!ముందర మనం క్షేత్రము,క్షేత్రజ్ఞుడు మధ్య తేడా తెలుసుకో గలగాలి.వికార సహితమయిన ఈ ప్రకృతి నుండి ముక్తి పొందే మార్గం కనుక్కోవాలి.అంటే,సర్వభూతాలకు సహజ సిద్థంగా వుండే వికారాలు,మాయా బంథాలనుంచి బయటపడే మార్గం,తమ తమ జ్ఞాన నేత్రాలతో చూడగలగాలి.అలా ప్రామాణికంగా చూడగల మహాత్ములు ఆ పరబ్రహ్మ,పరమాత్మను చూడగలుగుతారు,చేరుకోగలుగుతారు.అంటే ఇక్కడ క్షేత్ర క్షేత్రజ్ఞులను చూడగలిగే కళ్ళనే మనం జ్ఞానం అని అంటాము.ఎందుకంటే జ్ఞానం పరమాత్మ సాక్షాత్కారానికి తొలి మెట్టు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment