యథా సర్వగతం సౌక్ష్మాత్ ఆకాశం నోపలిప్యత్।
సర్వత్రావస్థితో దేహే తథాఽఽత్మా నోపలిప్యతే॥33॥
శ్రీమద్భగవద్గీతా...త్రయోదశాధ్యాయము
క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము
కృష్ణుడు అర్జునుడికి ఇంకా వివరిస్తున్నాడు.అర్జునా!నీకు తెలుసు కదా ఆకాశం అంతటా వ్యాపించి వుంటుంది అని.కానీ అది సూక్ష్మభావం వలన దేనినీ అంటదు.సరిగ్గా ఈ గుణం మనదేహంలో వుండే ఆత్మకు కూడా వర్తిస్తుంది.అలా ఎలా?ఎందుకు?అని అంటావా?చెబుతా విను.ఆత్మ అనేది గుణాలకు అతీతమయినది.కాబట్టి అది వివిథ శరీరాలలో ఉన్నా,వాటి గుణాలు ఏవీ దానికి లిప్యంకావు.అంటే అంటనే అంటవు.
No comments:
Post a Comment