Wednesday, 18 December 2024
పరంభూయః ప్రవక్ష్యామి
శ్రీమద్భగవద్గీత...చకుర్దశాధ్యాయము
గుణత్రయవిభాగయోగము
శ్రీభగవానువాచ....
పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం।
యద్ జ్ఞాత్వా మునయస్సర్వే పరాం సిద్ధిమితో గతాః॥1॥
కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.నేను జ్ఞానం గురించి ఇంతకు ముందు కొంత చెప్పి వున్నాను.అన్ని రకాల జ్ఞానాలలోకి అత్యంత ఉత్తమ మైన జ్ఞానం ఏదంటే,పరమజ్ఞానం అని నేను చెబుతాను.ఈ జ్ఞానం గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న మునులందరూ ముక్తులు అయ్యారు.పరమపదాన్ని పొందారు.మోక్షం సంపాదించారు.ఆ జ్ఞానం గురించి మరలా నీకు నేను చెబుతాను.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment