Sunday, 11 May 2025
కామ మాశ్రిత్య దుష్పూరం
కామ మాశ్రిత్య దుష్పూరం దమ్భమాన మదాన్వితాః।
మోహాత్గృహీత్వాఽసద్గ్రహాన్ ప్రవర్తంతేఽశుచివ్రతాః॥10॥శ్రీమద్భగవద్గీత... షోడశాధ్యాయము
దైవాసుర సంపద్విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడితో ఇంకా ఇలా అంటున్నాడు.అర్జునా!ఈ ఆసురీ స్వభావం గల వారి గురించి ఇంకా చెబుతాను, విను.వీళ్ళు ఎప్పుడూ కామాన్ని ఆశ్రయిస్తారు.దాని కారణంగా దంభం,దురభిమానము ఎక్కువగా వుంటుంది.అంటే గర్వం,మదం,భేషజం ఎక్కువగా ఉంటాయి.మదపూరితులై ఉంటారు.ఎప్పుడూ మూర్ఖపు పట్టుదలలతో అల్లాడుతూ ఉంటారు. వారు చేసే పనులు సహేతుకమా,కాదా అని ఒక్క క్షణం కూడా ఆలోచించరు.ఇలా మూర్ఖపు పట్టుదలలకు పోయి అపవిత్రతా దీక్షితులు అవుతుంటారు.తప్పు పనులు చేస్తుంటారు.ఆ తప్పుడు మార్గంలోనే వెళుతుంటారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment