Friday, 23 May 2025
సత్త్వానురూపా సర్వస్య
సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత।
శ్రద్ధామయోఽయం పురుషో యో య చ్ఛ్రద్ధ స ఏవ సః॥3॥
శ్రీమద్భగవద్గీత..।సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!ఓ భారతా!సర్వప్రాణికోటికి అంతఃకరణమనేది ఒకటి ఉంటుంది కదా!వారి వారి అంతఃకరణాన్ని అనుసరించి శ్రద్ధ అనేది పుడుతుంది.శ్రద్ధ లేనివాడు అసలు ప్రాణులలో లేనేలేడు.ఒకడిలో శ్రద్ధ అనేది ఏరూపంలో,ఏమాత్రంగా ఎలా ఉంటుందో,వాడూ అలాంటి వాడే అవుతాడు.శ్రద్ధ అంటే ఒక విషయం పైన మనకు ఉండే నమ్మకం,నిష్ట,నియమాలు.మనకు దేని పైన అయినా నమ్మకం ఉంటేనే కదా దానిని ఆచరిస్తాము.కాపాడుకుంటాము.చెడిపోకుండా చూసుకుంటాము.చెడగొట్టకుండా ఉంటాము.ఈ కార్యాలనే నిష్ట,నియమాలు అంటాము.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment