Saturday, 17 May 2025
త్రివిధం నరకస్యేదం
త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః।
కామః క్రోధ స్తథా లోభ స్తస్మాదేత త్త్రయం త్యజేత్॥21॥
శ్రీమద్భగవద్గీత...షోడశోధ్యాయము
దైవాసుర సంపద్విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి హితం చెబుతున్నాడు.అర్జునా!ఆసురీ స్వభావం కలవారి గుణగణాలు,వారి పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పాను కదా!కౌంతేయా!కామము,క్రోథము,లోభము అనేవి మూడూ నరకద్వారాలు.మనము చెడు మార్గంలో వేసే ప్రతి అడుగు మనలను ఆనరకానికి చేరువ చేస్తుంటుంది.మనము తప్పు చేసిన ప్రతి సారీ ఇంకొక సారి ఇలా జరగదు లే అని మనలను మనం మభ్య పెట్టుకుంటుంటాము.కానీ అదే చిలికి చిలికి గాలి వాన అవుతుంది.కాబట్టి మనము ఏదారిలో నడవాలి,ఏదారిలో ఉన్నాము అనే స్పృహతో ఉండాలి.ఎందుకంటే ఈ కామక్రోథ మదలోభాలు ఆత్మజ్ఞాన నాశనకారకాలు.మాములుగానే మనము మాయలో కప్పబడి ఉంటాము.దానికి తోడు ఇవన్నీ కలిసి వచ్చాయంటే మనలను సర్వనాశనం నుంచి ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు.కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని దుర్గుణాలను విడిచి పెట్టాలి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment