Monday, 19 May 2025
య శ్శాస్త్రవిధి ముత్సృజ్య
య శ్శాస్త్రవిధి ముత్సృజ్య వర్తతే కామకారతః।
న స సిద్ధి మవాప్నోతి న సుఖం న పరాం గతిమ్॥23॥
శ్రీమద్భగవద్గీత..।షోడశోధ్యాయము
దైవాసుర సంపద్విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి ఖరాఖండిగా ఈ విషయం చెబుతున్నాడు.అర్జునా!వేదశాస్త్రాలు అనేవి సర్వ మానవ కోటికి ప్రామాణికాలు.అవి చెప్పిన మాటలోనే,బాటలోనే ప్రతి ఒక్కరూ నడుచుకోవటం సర్వమానవాళికి ఉత్తమం.వాటిని అతిక్రమించే హక్కు ఎవరికీ లేదు.అంతా మా ఇష్టం.మాకు నచ్చినదే చేస్తాము,నచ్చినట్లే ఉంటాము అనుకునే స్వేచ్ఛాచార పరాయణులు కొందరు ఉంటారు.వాళ్ళకు అథోగతి అనివార్యం.వాళ్ళ దుష్కర్మలకు శాంతి దక్కే మార్గమేలేదు.ఇంక మోక్షం ఊసు ఎత్తే అర్హత ఎక్కడనుంచి వస్తుంది?కాబట్టి మంచి మార్గంలో నడవటం అలవాటు చేసుకుందాము.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment