Saturday, 31 May 2025
అభియంధాయ తు ఫలం
అభిసంధాయ తు ఫలం దమ్భార్థమపి చైవ యత్।
ఇజ్యతే భరతశ్రేష్ట తం యజ్ఞం విద్ధి రాజసమ్॥12॥
శ్రీమద్భగవద్గీత....సప్తదశాధ్యాయము
శ్రద్ధాత్రయ విభాగ యోగము
శ్రీకృష్ణుడు అర్జునుడికి రాజస యజ్ఞం గురించి వివరిస్తున్నాడు.హే అర్జునా!భరతులలో శ్రేష్టుడా!నా ఈ మాటలు విని అర్థం చేసుకో!మాములుగా మనం ఏ పనీ ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి.గొప్పలకు పోయి సమాజం లో,తనవారిలో గుర్తింపుకోసం చేయకూడదు అని చెప్పాను కదా!కానీ ఫలాపేక్షతో కానీ,డాంబికానికి గానీ యజ్ఞం చేసే వర్గం ఉంటుంది.అలా చేయబడే యజ్ఞాన్ని రాజస యజ్ఞంగా భావించు,గ్రహించు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment