Tuesday, 13 May 2025
చింతా మపరిమేయాం చ
చింతామపరిమేయాం చ ప్రలయాన్తాముపాశ్రితాః।
కామోపభోగపరమా ఏతావ దితి నిశ్చితాఽ॥11॥
ఆశాపాశ శతైర్బద్ధాః కామక్రోధ పరాయణాః।
ఈహంతే కామభోగార్ధ మన్యాయే నార్ధసంచయాన్॥12॥
శ్రీమద్భగవద్గీత...షోడశాధ్యాయము
దైవాసుర సంపద్విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి వివరంగా చెబుతున్నాడు.అర్జునా!ఈ ఆసురీ స్వభావం గలవారి గురించి ఇంకా చెబుతాను,విను.వీళ్ళు ఎప్పుడూ కామం,క్రోథంలను విడిచి పెట్టరు.అవి కూడా వీరిని విడిచి పెట్టవు.వాటి కబంథ హస్తాలలో వీళ్ళు చిక్కుకుని వుంటారు.ప్రాపంచిక మయిన విషయాలే జీవిత పరమావథిగా,పురుషార్థంగా భావిస్తారు.వాటిని అనుభవించడం జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారు.దాని కోసం నిత్యం అక్రమ మార్గాలలో ధనం సంపాదించే పనిలో పడతారు.జీవితాంతం నిత్యమూ ఆశాపాశాల ఊబిలో చిక్కుకుని,బయట పడలేక గిల గిల లాడుతుంటారు.వారికి కామక్రోధాలు అనే సుడిగుండాల నుంచి బయట పడే మార్గమే ఉండదు .వాళ్ళుకూడా బయటపడాలని కోరుకోరు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment