Tuesday, 11 February 2025
రజస్తమశ్చాభిభూయ
రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత
రజస్సత్త్వం తమశ్చైవ తమస్సత్త్వం రజస్తథా॥10॥
శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము
గుణత్రయ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడితో అసలు కిటుకుచెబుతున్నాడు.అర్జునా!ఈ మూడు గుణాలగురించి చెప్పాను.వీటి మధ్య ఇంకొక వ్వవహారము కూడా వుంది.చెబుతా విను.మన మనసుల పైన ఒక సారి రజోగుణము,తమోగుణాలను కాదని సత్త్వగుణము గెలుస్తుంది.ఇంకో సారి సత్త్వగుణము,తమోగుణాలను అణగ ద్రొక్కి రజోగుణము పై చేయి దక్కించుకుంటుంది.మరి ఇంకొక సారి సత్త్వ గుణము,రజోగుణాలని మూలకు నెట్టి,తమోగుణము మన నెత్తి మీద తైతక్కలాడుతుంది.ఇలా ఈ మూడు గుణాలు మనతో కబడ్డీ ఆడుకుంటుంటాయి.మనము ఆ గుణాలచేతిలో కీలుబొమ్మలము నిజానికి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment