Monday, 24 February 2025
కర్మణ సుకృతస్యాహుః
కర్మణ సుకృతస్యాహుః సాత్త్వికం నిర్మలం ఫలం
రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలమ్॥16॥
శ్రీమద్భగవద్గీత....చతుర్దశోధ్యాయము
గుణత్రయ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడిని మంచి మార్గంలో నడవమని చెబుతున్నాడు.అర్జునా! సత్త్వగుణము ఎంచుకొని ఆ మార్గంలో నడిచేదానికి ప్రయత్నించు.ఎందుకంటే,ఆ మంచి కర్మలవలన మనకు ఎలాంటి మాలిన్యం అంటని సౌఖ్యం దక్కుతుంది.అదే రాజసగుణం వలన దుఃఖం దక్కుతుంది.ఎందుకంటే మనము ప్రాపంచిక విషయ లాలసకు లోనవుతాము కదా!తామసగుణానికి సంబంధించిన కర్మలవల్ల అజ్ఞానము,అవివేకము,అలసత్త్వములకు మనము నివాస గృహం అవుతాము.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment