Friday, 7 February 2025
రజో రాగాత్మకం విద్ధి
రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవః।
తన్ని బధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినమ్॥7॥
శ్రీమద్భగవద్గీత.....చతుర్దశోధ్యాయము
గుణత్రయ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి త్రిగుణాల గురించి వివరంగా చెబుతున్నాడు.అర్జునా!రజోగుణం అనేది రాగమయము అయినది.అది కామము,మోహము,కాంక్ష,కోరిక,ఇష్టము....ఇలా తదితర భావాల ఆవేశం,సంపర్కముల వలన పుడుతుంది.ఈ గుణానికి లోబడిన జీవుడు ఇంక ఆ జంఝాటకం నుంచి బయట పడలేడు.సాలెగూడులో చిక్కుకున్న ఈగలాగ అక్కడక్కడే గింగిరాలు కొడుతుంటాడు.ఇంక వాడు అది చేకూరే మార్గాలనే అన్వేషిస్తూ,ఆ ఆ కర్మలచే బద్ధుడవుతాడు.వాడికి ఇంక వేరే ప్రపంచం కానరాదు.అవసరం లేదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment