Sunday, 16 February 2025
లోభః ప్రవృత్తి రారంభః
లోభః ప్రవృత్తి రారంభః కర్మణా మశమః స్పృహా
రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ॥12॥
శ్రీమద్భగవద్గీత....చతుర్దశోధ్యాయము
గుణత్రయ విభాగ యోగము
కృష్ణుడు అర్దునుడితో చెబుతున్నాడు.ఇప్పుడు నేను నీకు రజోగుణము గురించి చెబుతాను,విను.రజోగుణమనేది మనలో వృద్ధి అయింది అనుకో,మొదట బయటపడేది లోభత్వం.మనకు లోభగుణం,అదే పిసినారితనం అలవాటు అవుతుంది.అశాంతి మొదలు అవుతుంది.గుబులుగుబులుగా వుంటుంది.ఏ మంచి విషయం పైనా గురి కుదరదు.ఆశలు కళ్ళెంలేని గుఱ్ఱాలలాగా,మనల్ని పరుగులు పెట్టిస్తాయి.పనికిరాని పనులు,చెడు పనులు చేసేదానికి మనసు ఉవ్విళ్ళూరుతూ వుంటుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment