Tuesday, 18 February 2025
అప్రకాశోఽప్రవృత్తిశ్చ
అప్రకాశోఽప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ
తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందనా॥13॥
శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము
గుణత్రయ విభాగ యోగము
కృష్ణుడు కురు వంశంలో పుట్టిన, కులతిలకము అయిన అర్జునుడిని ఇలా సంబోధిస్తున్నాడు.హే కురునందనా!ఇప్పుడు ఇంక తమోగుణము గురించి మాట్లాడు కుందాము.మనలో ఈ తమోగుణము పైన లాలస పెరిగి,మోతాదు మించింది అనుకో,అప్పుడు ఈ ఈ వికారాలు మనలో మొదలు అవుతాయి.జీవితంలో ప్రకాశం,ఆశ ఉండవు.మన పనులు మనం చేసుకోవాలనే ఆకాంక్ష,ఉత్తేజం అసలే ఉండవు.అసలు సిసలు పని దొంగలం అవుతాము.ఏ పనీ చేయ బుద్ధి కాదు.సోమరితనం పుష్కలంగా వృద్ధి చెందుతుంది.ముందు వెనక ఆలోచించకుండా అపాయాలకు,ప్రమాదాలకు లోను అవుతాము.మూర్ఖత్వం ఇబ్బడి ముబ్బిడిగా పెరుగుతుంది.కాబట్టి వీటిని దరి చేరనివ్వకూడదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment