Friday, 28 February 2025
గుణానేతా నతీత్య త్రీన్
గుణానేతా నతీత్య త్రీన్ దేహీ దేహ సముద్భవాన్
జన్మ మృత్యు జరా దుఃఖైః విముక్తోఽమృత మశ్నుతే॥20॥
శ్రీమద్భగవద్గీత..।చతుర్దశోధ్యాయము
గుణత్రయ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి ముక్తికి మార్గం చెబుతున్నాడు.అర్జునా!దేహి అనగా బద్ధజీవుడు ఈ త్రిగుణాలను తన ఆధీనం లోకి తీసుకురాగలగాలి.వీటి పాశాలనుంచి విముక్తుడు కాగలగాలి.వీటిని సునాయాశంగా దాటగలగాలి.అతిక్రమించగలగాలి.అలాంటి జీవి జన్మ మృత్యు జరాది దుఃఖాలనుంచి బయట పడగలుగుతాడు.ముక్తికి బాటలు వేయగలుగుతాడు.ఆ పైన బ్రహ్మానందాన్ని పొందగలుగుతాడు.ఇందులో సందేహము లేదు.నన్ను నమ్ము.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment