Friday, 27 November 2026

మోఘాశా మోఘకర్మాణో…Moghaasaa moghakarmaano

మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః। రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః॥12॥9॥ శ్రీమద్భగవద్గీత...రాజవిద్యా రాజగుహ్య యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి అజ్ఞానము మనిషికి ఎంత చేటు చేస్తుందో,ఇంకెంత దిగజారుస్తుందో చెబుతున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!నేను ఇప్పుడే కదా చెప్పాను నీకు.సగటు మానవుడు నన్ను అర్థం చేసుకోలేడు సరిగ్గా అని.అలాంటివాళ్ళ వృత్తి,ప్రవృత్తి ఎలా ఉంటాయో చెబుతాను,విను.వాళ్ళు ఎప్పుడూ వృధా ఆశలతో సతమతమవుతూ ఉంటారు.వ్యర్థ కర్మలు చేస్తుంటారు.అంటే పనికిమాలిన పనులు,గొంతెమ్మ కోరికలు అన్నమాట!వారిని అజ్ఞానం అనే జడం అన్ని పక్కలనుంచీ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.అజ్ఞానానికి పరాకాష్ట ఏంది చెప్పు?సరే!నేను చెబుతాలే!అహంకారం!అహంకారానికి పరాకాష్ట?అసురీభావము.అంటే రాక్షసత్త్వం.నేనే గొప్ప,నే చెప్పేదే శాసనం!నా మాట వినకపోతే ఇంతే సంగతులు!ఈ భూమిపైన నూకలు చెల్లినట్లే అనే భావజాలము.ఇలా ఉంటుంది అజ్ఞాని మానసిక పరిస్థితి. Moghaasaa moghakarmaano moghajnaanaa vichethasah/ Raakshasee maasureem chaiva prakruthim mohineem srithaah//12//9// Sri madbhagavadgeetha...Raajavidyaa raajaguhya yogamu... Sri Krishna is explaining the mindset of ignorant person.Arjuna!hey Kireeti!I just told you that a commoner is incapable of recognising Me.Main reason is ignorance.Repurcussions of ignorance are catastrophic.Let me explain.They are always striving to acquire or possess out of greed rather than necessity.To fulfill their desires they indulge in waste or unwanted acts.Ignorance surrounds them like a shield out of which they fail to come out clear and clean.Ignorance leads to unnecessary and unwarranted ego and arrogance.These two main factors bring out all the demonic and wrongful atitude and behaviour in a person.So,they go down and down the vicious spiral till they reach the abyss.They become adamant,proud and harsh.They feel they are great and start dictating terms to the weak and needy.

No comments:

Post a Comment