Sunday, 27 September 2026

యేషాం త్వంతగతం….Yeshaam thvanthagatham

యేషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం। తే ద్వంద్వ మోహనిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః॥28॥7॥ శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు ఎవరు తనను సేవించగలుగుతున్నారు అని.అర్జునా!ఓ పార్థా!నన్ను సేవించే అవకాశం కొందరికే దక్కుతుంది.వారు పాపరహితులు అయి ఉండాలి.అదే పాపాలు చేయకూడదు.సుఖదుఃఖాలు,వాటి వల్ల వచ్చే మోహాలూ,తాపాలూ,తపనలకు దూరంగా ఉండగలగాలి.అలాంటి పుణ్యాత్ములు మటుకే నన్ను సేవించగలతారు. Yeshaam thvantha gatham paapam janaanaam punyakarmanaam/ The dvandva mohanirmukthaah bhajanthe maam drudavrathaah/28//7// Sri madbhagavadgeetha...Vijnaana yogamu.. Sri Krishna is telling Arjuna regarding who has the chance to pray Him and serve Him.Arjuna!hey Paardha!I told you that only certain section of people have the chance to serve me and be devoted to Me.Those people should not do bad acts,be bad natured.Happiness and sorrow are two main factors which distract a man from thinking calmly about Me.Because of these only,man is goaded to get emotional and goes in search of worldly pleasures.The good natured people who avoid all these worldly distractions and concentrate on Me will achieve Me.

ఇచ్ఛాద్వేష సముత్థేన…Ichchaadvesha samuthdhena

ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత। సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప॥27॥7॥ శ్రీమద్భగవద్గీత..।విజ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి సగటు మనిషి బలహీనతల గురించి చెబుతున్నాడు.అర్జునా!ఓ పరంతప!మనము మానవులను తప్పు పట్టేదానికి లేదు కూడా!ఎందుకంటావా?అతను పుట్టుకతో వచ్చి చేరే రాగ ద్వేషాలకు కట్టుబడి పోయి ఉంటాడు.వాటి ద్వారా కలిగే సుఖదుఃఖాల ఆటుపోట్లకు సతమతమవుతుంటాడు.ఆ మోహజాలంలో పడి జీవిస్తూ ఉంటాడు.ఆ సంకెళ్ళనుంచి బయటపడడం అంత సులువు కాదు. Ichchaa dvesha samuthdhena dvandva mohena bhaaratha/ Sarvabhoothaani sammoham sarge yaanthi paranthapa//27//7// Sri madbhagavadgeetha...Vijnaana yogamu... Sri Krishna is explaining Arjuna regarding futile nature of common man in reaching up to him.Arjuna!Bharathasreshta!O Paranthapa!humans in general are born with emotions of love and hate by birth.They cannot come out of it.They are being churned with happiness and sorrow caused due to these emotions.They are always attracted towards these bondings,emotions and survival.So,they fail to look beyond their turbulant lives and reach up to Me.

Saturday, 26 September 2026

వేదాహం సమతీతాని…Vedaaham samatheethaani

వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున। భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన॥26॥7॥ శ్రీమద్ భగవద్గీత..।విజ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!ఓ కిరీటీ!సగటు మనిషి నన్ను తెలుసుకోలేడు అని చెప్పాను కదా!జ్ఞాని కూడా కొంత మటుకు నన్ను అర్థం చేసుకునే ప్రక్రియలో విజయం సాథిస్తాడు.అలా ఎందుకు అంటావా?నేను భూత,భవిష్యత్ వర్తమాన కాలాలలోని సర్వ జీవులను ఎరిగి ఉంటాను.కానీ నన్ను ఎవరూ పూర్తిగా తెలుసుకోలేరు.అసలు చాలా మంది నా ఉనికినే గుర్తించలేని దీనమయిన స్థితిలో ఉంటారు. Vedaaham samatheethaani varthamaanaani chaarjuna/ Bhavishyaani cha bhoothaani maam thu veda na kaschana//26//7// Sri madbhagavadgeetha..,Vijnaana yogamu... Sri Krishna is explaining Arjuna like this.Arjuna!hey Kireeti!I told you that common man is unable to perceive my presence.Even the intellect can understand only to a cetain extent.The reason behind is simple.I know about each and every living being on the face of the earth in the past,present and future too.But no one can know about me so exhaustively.Most of the time,they fail to feel and understand my presence too.

Friday, 25 September 2026

నాహం ప్రకాశ….Naaham prakaasa

నాహం ప్రకాశ స్సర్వస్య యోగమాయా సమావృతః। మూఢోఽయం నాభిజానాతి లోకో మా మజ మవ్యయమ్॥25॥7॥ శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియ పరుస్తున్నాడు తనను మామూలు మనుష్యులు ఎందుకు తెలుసుకోలేక పోతున్నారు అనే విషయాన్ని.అర్జునా!ఓ బావా!నేను యోగమాయతో కూడిన వాడిని.నాకు చావు పుట్టుకలు లేవు.అరిషడ్వర్గాలకు అతీతుడిని.నేను శాశ్వతుడను.ఇవి,ఇలాంటివి మామూలు వాళ్ళ మేథస్సుకు అందని విషయాలు.వాళ్ళు భౌతిక ప్రపంచానికి,విషయాలకే ప్రాథాన్యం ఇస్తారు.అవే అర్థం అవుతాయి.కాబట్టి అజ్ఞానులు నన్ను తెలుసుకోలేరు. Naaham prakaasa ssarvasya yogamaayaa samaavruthah/ Moodoam naabhijaanaathi loko maa maja mavyayam//25//7// Sri madbhagavad geetha...Vijnaana yogamu... Sri Krishna is telling Arjuna as to why common man is unable to understand Him.Arjuna!hey brother!Ajnaani,the ignorant fails to understand me.The main reason behind it is this.I am covered by yogamaaya.I am above birth and death.I am permanent.I am eternal.All these facts and factors are above the imagination of common man.Because he is busy solving his material problems his entire life.He has neither the interest nor the time to think of things or know about Me.

Thursday, 24 September 2026

అవ్యక్తం వ్యక్తి…Avyaktham vyakthi

అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మా మబుద్ధయః। పరం భావ మజానంతో మమావ్యయ మనుత్తమమ్॥24॥7॥ శ్రీమద్భగవద్గీత...।విజ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి మామూలు మనుష్యులు ఎలా ఆలోచిస్తారో చెబుతున్నాడు.అర్జునా!ఓ పార్థా!నన్ను జ్ఞానులు తెలుసుకున్నట్లు మామూలు ప్రజానీకం తెలుసుకోలేదు.దీనికి బలమైన కారణం ఉంది.అది ఏంది అంటావా?నేను అవ్యక్తుడను.నేను నిర్వికారుడను,ఉత్కృష్టుడను,సర్వాతీతుడను.ఇలాంటి నా స్వరూపాన్ని అజ్ఞానులు గుర్తించలేకపోతున్నారు.నన్ను ఒక వ్యక్తిగానే పరిగణిస్తున్నారు. Avyaktham vyakthi maapannam manyanthe maa mabuddhayah/ Param bhaava majaanantho mamaavyaya manuththamam//24//7// Sri madnhagavadgeetha ...Vijnaana yogamu... Sri Krishna is explaining Arjuna as to why common man is unable to understand him and find him.Arjuna!hey Kireeti!I told you that only the enlightened persons can reach to me and find me.Main reason behind common mana futility in recognising and reaching out to me is this.I am immortal.I am sublime and super.I am omniscient,eternal,omnipotent and omnipresent.Common man looks up to me as another individual.He fails to see me in totality and understand me.

Wednesday, 23 September 2026

అంతవత్తు ఫలం…Anthavaththu phalam

అంతవత్తు ఫలం తేషాం తద్భవ త్యల్పమేధసామ్। దేవాన్ దేవ యజో యాంతి మద్భక్తా యాంతి మామపి॥23॥7॥ శ్రీమద్భగవద్గీత...।విజ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ప్రాప్తం గురించి చెబుతున్నాడు.అర్జునా!ఓ సఖా!పిండి కొద్దీ రొట్టె అని అంటారు కదా పెద్దలు.ఇక్కడ కూడా అలానే.స్వల్ప జ్ఞానులు అయిన వాళ్ళు దేవతారాధనకు వాళ్ళ కోరికలను బట్టి ఆయా దేవతలను పూజిస్తారు.కాబట్టి వారికి ఆ దేవతల అనుగ్రహం కలుగుతుంది.అలాగే జ్ఞానులు,జిజ్ఞాసాపరులు నన్ను పూజిస్తారు.వారు నన్ను పొందుతారు.అంతే కదా! Anthavaththu phalam theshaam thadbhava thyalpamedhasaam/ Devaan deva yajo yaanthi madbhakthaa yaamthi maamapu//23//7// Sri madbhagavadgeetha....Vijnaana yogamu.. Sri Krishna is telling Arjuna about fate.Arjuna!hey friend!you know that one reaps what he sows.In a way it is like getting what you pay for.Common man,with limited knowledge,seeks the blessings and help from deities,as per his wants or wishes.So,they get those deities blessings.One,who seeks me and learns about me will definitely procure my blessings and my support.

Tuesday, 22 September 2026

స తయా శ్రద్ధయా…Sa thayaa sradhdhayaa

స తయా శ్రద్ధయా యుక్త స్తస్యారాధన మీహతే। లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హి తామ్॥22/7// శ్రీమద్ భగవద్గీత....విజ్ఞాన యోగము...శ్రీకృష్ణుడు అర్జునుడికి తానే కర్త కర్మ క్రియ అనే విషయం ఇంకొక్క సారి చెబుతున్నాడు.అర్జునా!ఓ బావా!నేను నీకు ముందుగానే చెప్పాను కదా నేనే మూల పురుషుడిని అని.అణువణువులోన నేనే ఉంటాను.ప్రతి క్రియ ముందూ వెనకా కూడా నేనే ఉంటాను.దానికి ఇది కూడా ఒక ఉదాహరణే!మామూలు ప్రజలు ఏమనుకుంటారు?మనము ఫలానా దేవుడు లేక దేవతలను పూజిస్తున్నాము.వాళ్ళు మన పూజలకు తృప్తి పడి మన కోరికలు తీరుస్తున్నారు అనే కదా!కానీ నిజానికి ఆ మానవులలో కోరికలు కలిగించేదీ నేనే! ఆయా దేవతల రూపములో నెరవేర్చేది కూడా నేనే. Sa thayaa sraddhayaa yuktha sthasyaaraadhana meehathe/ Labhathe cha thathah kaamaan mayaiva vihithaan hi thaam//22//7// Sri madbhagavadgeetha...Vijnaana yogamu... Sri Krishna is telling once and again to Arjuna that he is centre point for everything that happens in this world.Arjuna!hey friend!what does a common man generally think?He thinks that he is praying particular deity for fulfilling his wants or desires.Concerned deity is pleased and sanctioning boons to him or her.Reality is different.I am the One who instills the desires or wishes in people.I am the One who fulfills their wishes.So,be reminded and remember that I am the central point for every act and its result.