Thursday, 10 July 2025

జ్ఞానం కర్మ చ కర్తా చ

జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః। ప్రోచ్యతే గుణసంఖ్యానే యథాచ్ఛృణు తాన్యపి॥19॥ శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము మోక్షసన్న్యాస యోగము గురువుకు ఎంత ఓపిక ఉండాలి,ఎంత విషయ పరిజ్ఞానము ఉండాలి,దానిని శిష్యుని పరిణితికి తగినట్లుగా ఎలా విశదీకరించాలి అనేది మనకు శ్రీకృష్ణుడిని చూస్తే అర్థం అవుతుంది.అతను అర్జునుడికి ఇంకా ఇలా చెబుతున్నాడు.అర్జునా!జ్ఞానము,కర్మ,కర్త అనేవి సాంఖ్యా శాస్త్రము ప్రకారము మూడేసి విధాలుగా ఉన్నాయి.వాటిని కూడా నీకోసం వివరంగా విశదీకరిస్తాను.మనసు పెట్టి అర్థం చేసుకునేదానికి ప్రయత్నించు.

No comments:

Post a Comment