Thursday, 17 July 2025

అనుబంధం క్షయం హింసా

అనుబంధం క్షయం హింసా మనపేక్ష్య చ పౌరుషమ్। మోహా దారభ్యతే కర్మ యత్త త్తామస ముచ్యతే॥25॥ శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్విక,రాజస కర్మలగురించి చెప్పాడు.ఇప్పుడు ఇంక తామస కర్మ గురించి వివరిస్తున్నాడు.అర్జునా!సాత్త్విక కర్మలు అంటే ఫలాపేక్ష,రాగద్వేషాలకు అతీతంగా చేసేవి,రాజస కర్మలు అంటే కర్మఫలాసక్తి,అహంకారాలతో చేసేవి అని చెప్పాను కదా!ఇప్పుడు ఇంక తామస కర్మల గురించి మాట్లాడుకుందాము.ఇక్కడ వ్యవహారం అంతా గొడ్డొచ్చి చేలో పడినట్లు ఉంటుంది.ఒక పని చేసే ముందు మంచి చెడ్డా ఆలోచించరు.కష్ట నిష్టూరాలను పరిగణలోకి తీసుకోరు.కామ రాగ మోహాలకు లోనై,మానసిక పరిపక్వత లేకుండా,మూర్ఖంగా కర్మలను ఆచరిస్తారు.ఇలాంటి వాటినే తామస కర్మలు అని అంటారు.

No comments:

Post a Comment