Sunday, 13 July 2025

యత్తు కృత్స్నవదేకస్మి

యత్తుకృత్స్నవదేకస్మి న్కార్యే సక్తమహైతుకమ్। అతత్త్వార్థవదల్పం చ త త్తామస ముదాహృతమ్॥22॥ శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్విక జ్ఞానం,రాజస జ్ఞానం గురించి చెప్పాడు.ఇంక తామస జ్ఞానం గురించి చెబుతున్నాడు.అర్జునా!ఇప్పుడే నీకు సాత్త్విక,రాజస జ్ఞానాలగురించి చెప్పాను కదా!తామస జ్ఞానంఅనేది ఏ రీతిలో ఉంటుందో కూడా తెలుసుకో!ఈ కోవకు చెందిన వారు ఏది చూసినా,అదే అంతా సర్వస్వం అనుకుంటారు.ఒక దేహాన్ని చూసినా,ఒక వస్తువును చూసినా దాని చుట్టూరా భ్రమిస్తుంటారు.ఈ రకంగా తలచే తత్త్వ విరుద్ధము అయిన జ్ఞానాన్నే తామస జ్ఞానము అని అంటారు.అంటే ఒక రకంగా చెప్పాలంటే బావిలో కప్పలాగా అన్నమాట.వారి ప్రపంచము చాలా చిన్నది.ఒక మనిషిని కానీ,ఒక వస్తువును చూస్తే,దాని చుట్టూరానే వాళ్ళ ఆలోచనలు,కర్మలు,క్రియలు తిరుగుతుంటాయి.వాటినిదాటి విశాల విశ్వం,విశ్వంభరుడు గురించి తెలుసుకునే సమయం,జిజ్ఞాస,ఆలోచన వాళ్ళకు ఉండవు,అంటవు.

No comments:

Post a Comment