Monday, 7 July 2025

యస్య నాహం కృతో భావో

యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే। హత్వాపి స ఇమాం ల్లోకాన్న హంతి న నిబధ్యతే॥17॥శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి అంతా మంచిగా అర్థం కావాలని తాపత్రయ పడుతున్నాడు.అందుకే ఇంకా ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!మనిషికి కర్తృత్వం పట్ల మమకారం ఉండకూడదు.అహం అనేది అసలే ఉండకూడదు.అంటే అంతా నేనే చేస్తున్నాను,అంతా నాదే,అంతా నా చెప్పు చేతల్లో ఉంది అనే భావన,అహంకారము.ఎందుకంటే ఇవంతా మన అజ్ఞానానికి కొండ గుర్తులు. కాబట్టి కర్తృత్వం పట్ల అహం లేని వాడూ,నేనే చేస్తున్నా అని అనుకునే అజ్ఞానం లేని వాడు చాలాగొప్ప.అతను ఈ లోకంలో అందరినీ తుద ముట్టించినా,ఆ పాపం అతనికి అంటదు.ఎందుకంటే అతని చర్యల్లో ప్రతిఫలాపేక్ష ఉండదు.స్వలాభం ఉండదు.అతను లోక కల్యాణం కోసమే చేస్తాడు కాబట్టి.

No comments:

Post a Comment