Monday, 14 July 2025

నియతం సంగరహితం

నియతం సంగరహిత మరాగద్వేషతః కృతమ్। అఫలప్రేప్సునా కర్మ యత్త త్సాత్త్విక ముచ్యతే॥23॥ శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి మూడు రకాల ధర్మాల గురించి వివరించాడు.అర్జునా!ఇప్పుడు అర్థము అయిందా,మొదటగా ఫలాపేక్షను వదలగలగాలి మానవుడు అని. ఫలాపేక్షను వదిలి పెట్టి,అభిమానము,రాగము,ద్వేషము అనే భావాలకు దూరంగా,అతీతంగా ఉండాలి.ఎందుకంటే ఆ మనోస్థితిలో ఉండి చేసే విధిహిత కర్మలే సాత్త్విక మయిన కర్మలు.అంటే మన మానసిక ధృఢత్వాన్ని అంచెలంచెలుగా పెంచుకోవాలి.ఎందుకంటే స్థితప్రజ్ఞత అనేది అనుకోగానే రాదు.దానికోసం మనము సాథన చేయాలి.

No comments:

Post a Comment