Wednesday, 30 July 2025

అధర్మం ధర్మమితి యా

అధర్మం ధర్మమితి యా మన్యతే తమసాఽఽవృతా। సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి స్సా పార్థ!తామసీ॥32॥ శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ఞుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.హే పార్థా!హే అర్జునా!ఇప్పుడిప్పుడే మనము సాత్త్విక,రాజస బుద్ధుల గురించి మాట్లాడుకున్నాము కదా!ఇప్పుడు నీకు ఇంక తామస బుద్ధి యొక్క పూర్వాపరాలు వివరిస్తాను.ఈ తామస బుద్ధి అనేది ఉందే,అది అంతా అస్తవ్యస్తంగా,గందరగోళంగా ఉంటుంది.అందుకే మామూలుగా వక్రబుద్ధి అని కూడా అంటుంటాము.దేనినీ సవ్యంగా,న్యాయపరంగా,మంచిగా ఆలోచించదు.అధర్మాన్ని ధర్మపథంలాగా అన్వయించుకుంటుంది.ఏ విషయము అయినా సీదా సాదాగా తీసుకోదు.వక్రంగా,అపసవ్యంగా ఆలోచిస్తుంది,గ్రహిస్తుంది.ఇలాంటి విపరీతమయిన భావజాలం కలిగి ఉండేదే తామస బుద్ధి అంటే!

No comments:

Post a Comment