Tuesday, 22 July 2025

అయుక్తః ప్రాకృతః స్తబ్ధః

అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోఽలసః। విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే॥28॥ శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము మోక్షసన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటున్నాడు.అర్జునా!నీకు ఇప్పుడు సాత్త్విక,రాజస కర్తల గురించి చెప్పాను కదా!ఇంక మనము తామస కర్తల గురించి చెప్పుకుందాము.వీళ్ళకు ధైర్యము ఉండదు.ఆత్మస్ధైర్యము అసలే ఉండదు.మూర్ఖపు పట్టుదలలు,అభిమానాలు సదా ఆవహించి ఉంటాయి.మోసాలకు పాల్పడే గుణం పుష్కలంగా ఉంటుంది.ఎంత సేపూ దిగేడుస్తూ ఉంటారు ఎదుటి వారి ఆనందం చూసి,తమ ఓటమి తలచుకుంటూ.సమయపాలన అసలు పాటించరు.వృధాగా కాలయాపన చేసేదానికి ముందు వరసలో ఉంటారు.ఏ పనినీ ఇష్టంగా,మనసు పెట్టి చేయరు.ఇలా పని చేసేవాడిని తామస కర్త అని అంటారు.

No comments:

Post a Comment