Wednesday, 23 July 2025

బుద్ధేర్భేదం ధృతేశ్చైవ

బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణత స్త్రివిధం శృణు। ప్రోచ్యమాన మశేషేణ పృథక్త్వేన ధనంజయ॥29॥ శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్తల గురించి చెప్పాడు.ఇప్పుడు ఇంక రకరకాల బుద్ధుల గురించి వివరించబోతున్నాడు.హే అర్జునా!హే ధనంజయా!నీకు కర్తల గురించి ఇప్పుడే చెప్పాను కదా!ఇంక రకరకాల బుద్ధుల గురించి కూడా విశదీకరిస్తాను.మంచిగా,మనసు పెట్టి విను.మనుష్యుల బుద్ధి అందరికీ ఒకేలాగా ఉండదు.గుణ భేదాల కారణంగా మూడు రకాలుగా విభజించ బడింది.అలాగే ధృతి కూడా!ధృతి అంటే చెబుతాను,విను.ధృతి అంటే స్థైర్యం అని అర్థం.ఒక లక్ష్యాన్ని ఛేదించేదానికి కావలసిన స్ధైర్యం,ధైర్యం,ఓర్పు,ధృఢత్వం...వీటన్నిటినీ కలిపి ధృతి అని అంటారు.

No comments:

Post a Comment