Sunday, 27 July 2025

యయా ధర్మమధర్మం

యయా ధర్మమధర్మం చ కార్యం చా కార్యమేవ చ। అయథావ త్ప్రజానాతి బుద్ధిస్సా పార్థ!రాజసీ॥31॥ శ్రీమద్భగవద్గీత..అష్టదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు ఇప్పుడిప్పుడే అర్జునుడికి సాత్వికబుద్ధి గురించి వివరించాడు.ఇప్పుడు ఇంక రాజస బుద్ధి గురించి చెప్పటం మొదలుపెట్టాడు.హే పార్థా!హే అర్జునా!సాత్విక బుద్ది అంటే ఎలా ఉంటుందో అర్థం అయింది కదా!రాజస బుద్ధి ఎలా ఉంటుందో చెబుతాను విను.ధర్మము-అధర్మము,కార్యము-అకార్యము..ఇలా ద్వంద్వాలు ఉన్నాయి కదా!వీటి అసలు అయిన జ్ఞానాన్నీ, అర్థాన్ని గుర్తించటంలో పప్పులో కాలు వేస్తారు.అంటే తప్పుగా అర్థం చేసుకుంటారు అన్నమాట!తపొప్పుల విశ్లేషణలో చతికిలా పడతారు.ఇలాంటి బుద్ధిని రాజస బుద్ధి అని అంటారు.

No comments:

Post a Comment