Thursday, 24 July 2025

ప్రవృత్తిం చ నివృత్తిం చ

ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే। బంధం మోక్షం చ యావేత్తి బుద్ధి స్సా పార్ధ!సాత్త్వికీ॥30॥ శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి తీరికగా,ఓపికగా వివరిస్తున్నాడు.అర్జునుడికి ఇప్పుడు తను రణరంగం మధ్యలో ఉన్నాననే స్పృహ లేనే లేదు.ఎందుకంటే కృష్ణుడు చెప్పే విషయాల పైన అంత లీనమైపోయి వింటున్నాడు.లోకంలో ఉండే సమయం అంతా వాళ్ళిద్దరే పంచుకున్నట్లుగా ఉంది!అర్జునా!నీకు ఇప్పుడు నేను సాత్విక బుద్ధి గురించి వివరిస్తాను.ధర్మము-అధర్మము,ప్రవృత్తి-నివృత్తి,కర్తవ్యము-అకర్తవ్యము,భయము-అభయము,బంధనము-మోక్షము...ఈ ద్వంద్వాలను అన్నిటినీ సుస్పష్టంగా తెలుసుకునే జ్ఞానం కలిగి ఉండటమే సాత్త్విక బుద్ధి.

No comments:

Post a Comment