Friday, 4 July 2025

తత్రైవం సతి కర్తారం

తత్రైవం సతి కర్తార మాత్మానం కేవలం తు యః। పశ్య త్యకృతబుద్ధిత్వా న్న స పశ్యతి దుర్మతిః॥16॥ శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా వివరిస్తున్నాడు.అర్జునా!కొన్ని పచ్చి నిజాలు ఉంటాయి.మనము వాటిని ఒప్పుకున్నా,ఒప్పుకోకపోయినా నిత్యము,సత్యము అయిన వాటిలో మార్పులు,చేర్పులు ఉండవు.మనము చేసే సమస్త కర్మలకూ ఆ అయిదే కారణము అనేది సత్యము,నిత్యము.కానీ బుద్ధి పరిపక్వత లేని వాడు అలా ఆలోచించడు,నమ్మడు.అన్నిటికీ కారణభూతుడు తానే అనే భ్రమలో,అహంకారంతో ఊగిసలాడుతుంటాడు.అపరిపక్వంగా ఆలోచించేవాడే అలా ఉంటే దుష్టబుద్ధి గలవారు,చెడుభావాలు కలవారు ఇంక ఎంతలా ఆలోచిస్తారో మన ఊహకే అందదు. కాబట్టి మానవుడు అహంకారము,కామము,క్రోధము వదలక పోతే సన్నార్గములోకి రాలేడు అనేది ముమ్మాటికీ నిజము.

No comments:

Post a Comment