Tuesday, 15 July 2025

యత్తు కామేప్సునా కర్మ

యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః। క్రియతే బహులాయాసం తద్రాజస ముదాహృతమ్॥24॥ శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి సాత్త్విక కర్మల గురుంచి ఇప్పుడే చెప్పాడు.ఇంక ఇప్పుడు రాజస కర్మల గురించి ప్రస్తావిస్తున్నాడు.అర్జునా!సాత్త్విక కర్మలు అనేవి ఫలాపేక్ష రహితంగా చెయ్యాలని అర్థం అయింది కదా!ఇప్పుడు మనము రాజస కర్మల పూర్వాపరాలు మాట్లాడుకుందాము.ఇక్కడ వీరు చేసే ప్రతి పని దాని వలన వచ్చే లాభం గురించి బేరీజు వేసుకుని చేస్తారు.లాభం లేకపోతే పూచిక పుల్ల కూడా తీసి ప్రక్కన పెట్టరు.అహంకారానికి,గర్వానికి పోయి చేస్తారు.ఆ పనులు వారికి ఎంత కష్టమయినా గొప్పల కోసం చేస్తారు.అంటే అందరూ ఆహా!ఓహో! అని తమ గురించి అనుకోవాలనే తపన నరనరాన కనిపిస్తూ ఉంటుంది.ఇలా కర్మ ఫలాసక్తితో,అహంకార అభిమానాలతో చేసే మిక్కిలి కష్ట సాధ్యమయిన పనులను రాజస కర్మలు అని అంటారు.

No comments:

Post a Comment