Wednesday, 9 July 2025

జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా

జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా। కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మ సంగ్రహః॥18॥ శ్రీమద్భగవద్గీత..।అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్మలు,వాటి ప్రోత్సాహకాలు గురించి వివరిస్తున్నాడు.అర్జునా!రకరకాలు అయిన కర్మలను ప్రోత్సాహ పరచే కారణాలు మూడు ఉన్నాయి.అవి జ్ఞానము,జ్ఞేయము మరియు పరిజ్ఞాత.అలాగే కర్మ సంగ్రహము కూడా మూడు విధాలు ఉన్నాయి.అవి కర్త,కర్మ మరియు సాధనము. జ్ఞానము అంటే విషయ పరిజ్ఞానము,విచక్షణ,పాండిత్యము.జ్ఞేయము అంటే తెలుసుకోవలసిన విషయము అని అర్థము.పరిజ్ఞాత అంటే అన్నీ తెలిసిన వ్యక్తి అని అర్థము.

No comments:

Post a Comment