Friday, 12 September 2025

మన్మనాభవ మద్భక్తో

మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు। మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోఽసి మే॥65॥ శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుఢు అర్జునుడికి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాడు.మామూలుగా గురువులు ఒకసారి చెప్పి శిష్యులను పదే పదే చదివి,అర్థం చేసుకుని,గుర్తు పెట్టుకోమంటారు.కానీ ఇక్కడ భగవంతుడు గురువుగా మారి,శిష్యుడు అయిన అర్జునుడికి పదే పదే హితోఽపదేశం చేస్తున్నాడు.అర్జునుడు ఎంత అదృష్టవంతుడో కదా! హే అర్జునా!ఓ పార్థా!నా యందే నిశ్చలమయిన మనసుతో ఉండు.ద్వంద్వాలకు లోను కావద్దు.నన్నే అటలమయిన భక్తితో సేవించు.నన్నే పూజించి,తరించు.నాకే నమస్కరించు.నాకు ఇష్టమయినవాడివి కనుక నీకు ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను.గుర్తు పెట్టుకో!నన్ను నమ్మినవాడు ఎన్నటికీ చెడిపోడు.నువ్వు ఖచ్చితంగా నన్నే పొందుతావు.అంటే మోక్షం పొందుతావు అనే కదా!ఇందులో ఎలాంటి సందేహం లేదు.

No comments:

Post a Comment