Friday, 19 September 2025

కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ

కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైక్తాగ్రేణ చేతసా। కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్ట స్తే ధనంజయ॥72॥ శ్రీమద్భగవద్గీత...అష్టదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము మమూలుగా పాఠం చెప్పడం అయిపోగానే గురువులు పిల్లలతో ఏమి అంటారు?నేను చెప్పింది ఎంత అర్థం అయింది?బాగా అర్థం చేసుకున్నారా?మీకు ఏమైనా ఇంకా అనుమానాలు ఉన్నాయా?ఉంటే చేతులు ఎత్తండి.ఒక్కొక్కళ్ళ అనుమానాలు తీరుస్తాను. అచ్చం అలాగే శ్రీకృష్ణుడు అర్జునుడిని అడుగుతున్నాడు.హే పార్థా!ఓ ధనంజయా!ఇంత సేపూ నేను చెప్పింది ఏంది? నిజంగా మనసు పెట్టి విన్నావా?ఏమనిపిస్తుంది నీకు? నీ అజ్ఞానం ఏమైనా తగ్గుమొఖం పట్టిందా?దాని వలన సంక్రమించే మోహం నశించిందా?న మనసుకు ఏమనిపిస్తుంది?నకు సవివరంగా సమాధానం ఇవ్వు.

No comments:

Post a Comment