Thursday, 25 September 2025

తచ్చ సంస్మృత్య సంస్మృత్య

తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతమ్ హరేః। విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః॥77॥ శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము సంజయుడు ధృతరాష్ట్రుడికి తన ఆనందం,తన అదృష్టం గురించి పదే పదే,మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాడు.ఎన్ని సార్లు చెప్పినా తనివి తీరటం లేదు.ఆ క్షణాలు మళ్ళీ మళ్ళీ ఆస్వాదిస్తున్నాడు.గుర్తు వస్తేనే మనసు అంతా పులకరించి పోతుంది.తన అదృష్టానికి తనే దిష్టి పెట్టుకుంటున్నాడు.ఓ ధృతరాష్ట్ర మహారాజా!శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు కదా!నా కళ్ళు మిరుమిట్లు గొలిపాయి.నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.ఇది కలయా,నిజమా లేక వైష్ణవ మాయా!నాకేమీ అర్థం కావడం లేదు.ఆ అద్భుతమయిన విశ్వరూపం పదే పదే నాకు కనిపిస్తుంది.నా ఆనందానికి అడ్డూ ఆపు లేవు.నా మనసు పరవశత్వంతో పుంతలు తొక్కుతూ ఉంది.నా అంత ధన్య జీవి ఈ లోకంలో ఇంకెవరూ లేరు.

No comments:

Post a Comment