Saturday, 13 September 2025

సర్వధర్మాన్ పరిత్యజ్య

సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ। అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః॥66॥ శ్రీమద్భగవద్గీత....అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి చిలకకు చెప్పినట్లు చెబుతున్నాడు.ఓ అర్జునా!ఓ ధనంజయా!నీవు అసలు ఏమీ ఆలోచించే పనిలేదు.కళ్ళు మూసుకుని నన్ను నమ్ముకో!ఈ భవసాగరాన్ని దాటిస్తాను.అన్ని ధర్మాలనూ పక్కకు పెట్టేయి.ఈ భూమండలంలో నేను తప్పిస్తే నీ హితవు కోరేవారు నా అంత ఇంకొకరు లేరు.కాబట్టి నన్నొక్కణ్ణే శరణు కోరు.నేను నిన్ను పూర్వ,ప్రస్తుత,భవిష్యత్ పాపాలనుంచి కాపాడుతాను.సర్వకాల సర్వావస్థలయందు నిన్ను రక్షిస్తాను.నీకు మోక్ష ప్రాప్తి కలిగిస్తాను.

No comments:

Post a Comment