Thursday, 18 September 2025

శ్రద్ధావాననసూయశ్చ

శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః। సోఽపి ముక్తశ్శుభాన్ లోకాన్ ప్రాప్నుయా త్పుణ్యకర్మణామ్॥71॥ శ్రీమద్భగవద్గీత...అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా వివరంగా చెబుతున్నాడు.అర్జునా!ఈ గీతను,గీతాసారాన్నీ శ్రద్ధగా,భక్తిగా,ఆసక్తిగా చదవాలి.వినాలి.అలా చేసినవారు గొప్ప గొప్ప పుణ్యాలు చేసిన వారికి ఏ మాత్రం తీసిపోరు.అంటే అసూయ లేకుండా,శ్రద్ధాసక్తులతో ఎవరైతే వింటారో,వారు పుణ్యాత్ములు పొందే పుణ్యలోకాలను సునాయాసంగా,సులభంగా,అవలీలగా పొందగలుగుతారు.ఇందులో ఎలాంటి సందేహము లేదు.

No comments:

Post a Comment