Wednesday, 24 September 2025

రాజన్! సంస్మృత్య సంస్మృత్య

రాజన్! సంస్మృత్య సంస్మృత్య సంవాద మిమ మద్భుతమ్। కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః॥76॥ శ్రీమద్భగవద్గీత...అష్టదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము మాములుగా అద్భుతాన్ని కనినా,వినినా,అనుభవించినా జీవితం ధన్యమవుతుంది.ఇన్ని యుగాలుగా భగవద్గీతను చదివినా,వినినా ఒళ్ళు పులకరించి పోతుంది తాదాత్మ్యంతో ప్రతి ఒక్కరికీ.అలాంటిది నేరుగా శ్రీకృష్ణుడు అర్జునుడు సంవాదము విని తరించిన సంజయుడి మానసిక పరిస్థితి ఇంక ఎలా ఉండాలి? అదే చెబుతున్నాడు సంజయుడు ధృతరాష్ట్రుడికి.ఓ రాజా!శ్రీకృష్ణార్జునుల సంవాదం మాటి మాటికీ గుర్తు వస్తున్నది.అసలు మర్చిపోలేక పోతున్నాను.నా మనసు అంతా ఉప్పొంగి పోతుంది.ఈ ఆనందం పట్టనలవి కాకుండా ఉంది.

No comments:

Post a Comment